Sunday, 19 March 2017

best mobiles

మీ మనసులో మాటను ఎఫ్‌బీ లైవ్‌ వీడియోలో చెప్పేశారు...
సెల్ఫీలు, ఫొటోలకు రకరకాల ఆప్‌లతో సొబగులద్దారు...
భారీ బ్యాటరీతో మీ స్మార్ట్‌ఫోన్లను భలేగా వాడుకున్నారు...
మొబైల్‌లో మరింత ఎక్కువ సమాచారాన్ని స్టోర్‌ చేసుకున్నారు...
పాటలు, వీడియోలను ఆఫ్‌లైన్‌ చేసుకొని తీరిగ్గా ఆస్వాదించారు...
మొబైల్‌ తెర పరిమాణం పెరిగింది... వంపులు తిరిగింది...
వర్చువల్‌ వీడియోలు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వాట్సాప్‌లో కొత్త ఆప్షన్లు...
గూగుల్‌ కొత్త ప్రోడెక్ట్‌లు, ఆపిల్‌ తాజా ఓఎస్‌లు, సరికొత్త మొబైళ్లు...!
ఇలా 2016 ఎన్నెన్నో సాంకేతిక సొగసులను పరిచయం చేసి, కొత్త సంవత్సరాన్ని ‘అప్‌డేట్‌’ చేస్తూ వెళ్లిపోతోంది. సెల్‌ఫోన్‌లోకి కొత్త ఆప్‌ డౌన్‌లోడ్‌ అవుతున్నట్టు 2017 త్వరలో ఇన్‌స్టాల్‌ కాబోతోంది! ఈ నేపథ్యంలో ఈ ఏడాది ‘గ్యాలరీ’లో జ్ఞాపకాల స్టోరేజీని ఓసారి రివైండ్‌ చేసి చూసుకుందామా!

మెచ్చిన మొబైల్స్‌
ఏటా చాలా స్మార్ట్‌ ఫోన్లు వస్తుంటాయి... కానీ కొన్నే వినియోగదారుల జేబుల్లోకి, మనసులోకి చేరుతుంటాయి. అలా ఈ ఏడాది మెచ్చిన కొన్ని మొబైల్స్‌ ఇవిగో...
ఐఫోన్‌ 7 ప్లస్‌
ప్పటివరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో ఉన్న 3.5 ఎం.ఎం జాక్‌ లేకుండా వచ్చింది ఐఫోన్‌ 7. వాటర్‌ ప్రూఫ్‌ బాడీ, వెనుకవైపు రెండు కెమెరాలు, టచ్‌ ఐడీ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, త్రీడీ టచ్‌ లాంటి ప్రత్యేకతలు ఈ మొబైల్‌లో ఉన్నాయి. ఇందులో 32 జీబీ, 128 జీబీ వెర్షన్‌లు న్నాయి. ఇయర్‌ ఫోన్స్‌ స్థానంలో బ్లూటూత్‌ ఇయర్‌ బడ్స్‌ ఇచ్చారు.
గూగుల్‌ పిక్సల్‌
గూగుల్‌ నుంచి తొలి మొబైల్‌గా గూగుల్‌ పిక్సల్‌ రూపొందింది. ఇప్పటికే ఆ సంస్థ నుంచి నెక్సస్‌ ఫోన్లు వచ్చినా వాటిపై గూగుల్‌ మార్క్‌ ఉండదు. గూగుల్‌ కొత్త ప్రాడెక్ట్‌ గూగుల్‌ అసిస్టెంట్‌ ఈ మొబైల్స్‌ అదనపు ప్రత్యేకత. 5 అంగుళాల తాకేతెరతో పిక్సల్‌, 5.5 అంగుళాల తాకే తెరతో పిక్సల్‌ ఎక్సెల్‌ రూపొందాయి. 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ/128 జీబీ అంతర్గత మెమొరీ ఉంటాయి. 
శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7
వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, వాటర్‌ ప్రూప్‌... లాంటి ప్రత్యేకతలతో రూపొందింది శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 7. ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా వచ్చిన ఈ మొబైల్‌లో ఎస్‌డీ కార్డుతో 2 టీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. వైడ్‌ యాంగిల్‌ కెమెరాతో ఫొటోలు తీస్తూ మజాను పొందొచ్చు. ఎస్‌ 7 ఎడ్జ్‌లో తాకే తెర చివర్ల వంపు తిరిగి ఉంటుంది. షార్ట్‌కట్‌ మెనూకి ఇది ఉపయుక్తం.
హానర్‌ 8
వెనుకవైపు రెండు కెమెరాలు... ఈ ఏడాది కొత్త ట్రెండ్‌. ఇలా వచ్చిన మొబైల్స్‌లో హానర్‌ 8 ఒకటి. ఈ మొబైల్‌లో వెనుకవైపు 12 ఎంపీ కెమెరాలు రెండు ఉంటాయి. దీని వల్ల తక్కువ వెలుతురులోనూ ప్రభావవంతమైన ఫొటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంటుంది. డ్యూయల్‌ కలర్‌ టెంపరేచర్‌ ఫ్లాష్‌ వల్ల ఈ ఫోన్‌ ఫొటోలకు ప్రత్యేకంగా నిలిచింది.
మోటో జెడ్‌ ప్లే
కటే ఫోను... వినియోగాలు అనేకం. ఈ కాన్సెప్ట్‌తో మోటో సిరీస్‌లో వచ్చిన మాడ్యులర్‌ ఫోన్‌ మోటో జెడ్‌ ప్లే. రోజుకో చొక్కా తొడుక్కునట్లే కెమెరా కావాలంటే కెమెరా, స్పీకర్‌ కావాలంటే స్పీకర్‌ బాక్స్‌... ఇలా దేన్నైనా ఈ మొబైల్‌కు జోడించేయొచ్చు. మెమొరీ కార్డుతో 2 టీబీ వరకు స్టోరేజీని పెంచుకోవడం ఈ మొబైల్‌ ప్రత్యేకత.
వన్‌ ప్లస్‌ 3
క్కువ స్టోరేజీ.. ర్యామ్‌ సైజు లాంటి ఆప్షన్లతో వచ్చింది వన్‌ ప్లస్‌ 3. ఇప్పటివరకు వచ్చిన వన్‌ ప్లస్‌ సిరీస్‌ ఫోన్ల మాదిరిగానే ఇదీ సరికొత్త హంగులతో రూపొందింది. 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత స్టోరేజీ ఉంటాయి. మార్స్‌మాలో బేస్డ్‌ ఆక్సిజన్‌ ఓఎస్‌తో ఇది పని చేస్తుంది. డ్యాష్‌ ఛార్జ్‌తో మొబైల్‌ను వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు.
రెడ్‌మీ నోట్‌ 3.. రెడ్‌మీ 3ఎస్‌
వెనుకవైపు 16 ఎంపీ కెమెరా, ముందువైపు 5 ఎంపీ కెమెరా, 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. రెడ్‌మీ నోట్‌ 3 మొబైల్‌ దూసుకుపోవడానికి కారణం ఈ ఆప్షన్సే. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీతో వచ్చిన ఈ మొబైల్‌ ఈ ఏడాది మేటి మొబైల్స్‌లో ఒకటిగా నిలిచింది. 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ అంతర్గత మెమొరీతో మరో రెడ్‌మీ నోట్‌ 3 కూడా విడుదలైంది. రూ.పది వేల లోపు ధర, 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రూపొందిన మొబైల్‌ రెడ్‌మీ 3ఎస్‌ ప్రైమ్‌. తక్కువ ధరలో ఆ స్థాయి బ్యాటరీ దీని ప్రత్యేకత. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీ ఉన్నాయి. 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ అంతర్గత మెమొరీతో రెడ్‌మీ 3 ఎస్‌ కూడా ఉంది.
లీఎకో లీ మ్యాక్స్‌ 2
పెద్ద తెర ఫోన్లు ఇష్టపడేవారి కోసం లీఎకో నుంచి 5.7 అంగుళాల తాకే తెరతో లీ మ్యాక్స్‌ 2 మొబైల్‌ వచ్చింది. 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీ లాంటి ఆప్షన్లున్నాయి. 21 ఎంపీ వెనుకవైపు కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంది. ఇందులోనే 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీతో మరో మోడల్‌ ఉంది
లెనోవో జెడ్‌ 2 ప్లస్‌
స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలులో అంతర్గత మెమొరీదే కీలక ఆప్షన్‌. 64 జీబీ అంతర్గత మెమొరీతో లెనోవో జెడ్‌ 2 ప్లస్‌ మొబైల్‌ మార్కెట్‌లోకి వచ్చింది. 4 జీబీ ర్యామ్‌ ఉంటుంది. 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, స్లిమ్‌ లుక్‌తో ఈ మొబైల్‌ ఆదరణ దక్కించుకుంది.

No comments:

Post a Comment