అరటి నారతో బట్టలు,బ్యాగులు

బట్టల
తయారీకి ఎక్కువగా పత్తితో చేసిన దారాన్ని ఉపయోగిస్తారు. పట్టు వస్త్రాలను
సిల్క్ తో తయారు చేస్తారు. ఇది కామన్. తాజాగా అరటి నారతో కూడా బట్టలను
తయారు చేయవచ్చంది తమిళనాడు తిరుచునాపల్లిలోని జాతీయ అరటిపరిశోధన కేంద్రం.
అరటి బోదెల నుంచి తీసిన నాణ్యమైన నార ద్వారా తయారు చేసే వినూత్న విధానాన్ని
కనుగొంది. దాని ద్వారా తయారు చేసిన చీరలు,చొక్కాలను జాతీయ కృషి ఉన్నతి
మేళాలో ప్రదర్శించింది. ఈ అంశంలో తమ సంస్థ ఔత్సాహికులకు శిక్షణ ఇస్తుందని
పరిశోధన సంస్థ ప్రతినిధులు తెలిపారు. అరటి బోదెల నుంచి పలురకాల నారను
తీయొచ్చని… అందులో అత్యంత నాణ్యమైన నారతో వస్త్రాలు, కొంత ముడిగా ఉన్న
దాంతో హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర వస్తువులు తయారుచేయొచ్చని తెలిపారు. అరటి
నుంచి మొత్తం 25 ఉత్పత్తులను తయారుచేయడంలో తమ సంస్థ శిక్షణ ఇస్తున్నట్లు
తెలిపారు.
No comments:
Post a Comment